సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణంలో గ్రామ పంచాయతీ వాటర్ మేన్‌గా పనిచేస్తున్న జలగం సైదులు అనే వ్యక్తిపై కోతులు దాడి చేశాయి. ఎంపీపీ కార్యాలయంలో నీళ్లు ఇవ్వడానికి వెళ్లగా.. అక్కడే చెట్లపై ఉన్న వానర సైన్యం ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. ఘటనలో సైదులుకు గాయాలయ్యాయి. గుర్తించిన గ్రామస్థులు కోతులను తరిమికొట్టారు. సైదులును చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పట్టణంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: 28 వరకు శాసనసభ వర్షాకాల సమావేశాలు..ఈనెల 9న రెవెన్యూ బిల్లు