సోషల్ మీడియాలో అకౌంట్‌ను మార్ఫింగ్ చేసిన మొగిలి రాజేశ్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన అకౌంట్‌ను మార్ఫింగ్ చేయడంతో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుమారుడు గౌతంరెడ్డి పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్వేశ్ కుమార్ నిర్మల్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్వేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.... గాంధీనగర్‌కు చెందిన మొగిలి రాజేశ్ అనే యువకుడు అకౌంట్‌ను మార్ఫింగ్ చేసినట్లు గుర్తించారు.
మొగిలి రాజేశ్‌పై 505 (1), (బి), (2) & 67 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో కించపరిచే విధంగా ప్రచారం చేసిన అటవీ శాఖ అధికారి ఫారూఖ్ ఖాన్ అనే ఉద్యోగిపై కేసునమోదు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చూడండి: డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతులపై సర్కార్ కసరత్తు