విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలంలో పవన్ కుమార్ అనే వివాహితుడు ఓ బాలికపై అత్యాచారం చేశాడు. తనపై అత్యాచారం చేశాడంటూ బాధితురాలు జి.మాడుగుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సీఐ బాబును ప్రశ్నించగా... తమకు ఫిర్యాదు అందిందని, నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. అభం శుభం తెలియని ఇంటర్ విద్యార్థిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కిషన్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు: హరీశ్