జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీ బోర్డు ఛైర్మన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కల్వకుంట్ల రాజేశ్వర్ రావు హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన రాజేశ్వర్ రావు.. గ్రామ సర్పంచ్‌గా మూడు సార్లు గెలుపొందారు. 2001లో మెట్పల్లి జడ్పీటీసీగా గెలుపొంది ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా సేవలందించారు. తెరాస ఆవిర్భావం అనంతరం కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
2006 మార్చిలో మెట్పల్లి ఖాదీ బోర్డు డైరెక్టర్‌గా చేరిన రాజేశ్వరరావు 2008 మే 28న ఖాదీ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రజల మధ్యే ఉంటూ పుట్టిన ఊరు అభివృద్ధికి కృషి చేసిన రాజేశ్వర్ రావు మృతితో మొగిలిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కల్వకుంట్ల రాజేశ్వర్ రావుకి చివరిసారిగా వీడ్కోలు పలికారు. రాజేశ్వర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.