హైదరాబాద్ ఎల్బీనగర్‌లో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అలేఖ్య టవర్స్‌లోని 14వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు సాహితి.. ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది.
ఎంబీబీఎస్ సీట్ రాలేదనే మనస్తాపం, తండ్రి మందలించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.