ప్రియుడితో భర్తను హతమార్చిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదోనిగడ్డ తండాలో చోటు చేసుకుంది. కేసు వివరాలను బాలానగర్ డీసీపీ పద్మజా వెల్లడించారు. సైదోనిగడ్డ తండాకు చెందిన సురేష్‌కు దుండిగల్ తండాకు చెందిన బబితకు 2014లో వివాహం జరిగింది. అంతకుముందే బబితకు ప్రేమ్‌సింగ్‌తో వివాహేతర సంబంధం ఉంది. కొన్ని రోజుల క్రితం సురేష్‌పై బబిత విషప్రయోగం చేసింది. పెద్దల సమక్షంలో తప్పు ఒప్పుకోవడం వల్ల క్షమించి సురేష్ కాపురం చేసుకుంటున్నాడు.
సురేష్ అడ్డు తొలగించుకుంటే కలిసి ఉండొచ్చని... బబిత, ప్రేమ్‌సింగ్ నిర్ణయించుకున్నారు. యాక్సిడెంట్ చేసి హతమార్చాలని పథకం పన్నారు. ప్రేమ్‌సింగ్ తన మిత్రులు రాహుల్, అజ్మీరా ప్రేమ్, మంగోత్ రాజుతో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సురేష్ మే నెల23న తుర్కపల్లి భారత్ బయోటెక్‌లో పనికి వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా... పథకం ప్రకారం డీసీఎంతో ఢీ కొట్టారు. కారులో ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టు నటించి... మార్గం మధ్యలో గొంతు నులిమి చంపారు. ఈ ఘటనలో 9మంది ప్రమేయం ఉండగా... ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు పరారీలో ఉన్నట్టు డీసీపీ పద్మజా రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య