ETV Bharat / jagte-raho

ప్రేమించి పెళ్లాడింది.. ఏడు నెలలకే తనువు చాలించింది..

ప్రేమించింది... పెద్దలను కాదని వివాహం చేసుకుంది. ఇక భర్తే సర్వస్వం అనుకుంది. ఇంతలోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కీసర పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

married women suicide at medchal district
ప్రేమించి పెళ్లాడింది.. ఏడు నెలలకే తనువు చాలించింది..
author img

By

Published : Aug 17, 2020, 11:33 AM IST

Updated : Aug 17, 2020, 5:26 PM IST

మేడ్చల్​ జిల్లా కీసర పోలీస్​స్టేషన్​ పరిధిలోని రాంపల్లిలో తెల్లవారు జామున ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. త్రినయని(20) ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అయితే భర్త అక్షయ్​ వేధింపులు తట్టుకోలేక... ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈసీఐఎల్​కు చెందిన అక్షయ్ కుమార్.. రాంపల్లి చెందిన త్రినయని ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆపై పెద్దలను ఎదిరించి ఏడు నెలల క్రితం ఆర్య సమాజ్​లో వివాహం చేసుకున్నారు. అనంతరం రాంపల్లి పీసీఆర్​ ఎంక్లేవ్​లో నివాసం ఉంటున్నారు.

వివాహం జరిగిన మొదటి నెల బాగానే ఉన్నా.. అనంతరం డ్రగ్స్​కు బానిసైన అల్లుడు.. తమ కూతురిని వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఏ పని చేసేవాడు కాదని.. తరచూ తమ కూతురని కొట్టేవాడని.. బాధితులు వాపోయారు. ఈ విషయం తమ కుమార్తె స్వయంగా చెప్పిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రేమించి పెళ్లాడింది.. ఏడు నెలలకే తనువు చాలించింది..

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కీసర పోలీసులు.. హత్య.. ఆత్మహత్య.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: భారత్​ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు

Last Updated : Aug 17, 2020, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.