నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏఎన్ రెడ్డి కాలనీకి చెందిన తోట మౌనిక అనే వివాహిత గురువారం నాడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నిర్మల్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సోన్ మండల కేంద్రంలోని గోదావరి వంతెనపై మౌనిక ద్విచక్రవాహనం, చెప్పులు దొరికాయి. వంతెనపై ద్విచక్ర వాహనం చెప్పులు కనిపించటం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందేమో అని అనుమానం చేస్తున్నారు. ఎవరికైనా మౌనిక ఆచూకీ లభిస్తే 9440795018, 7901122512 నంబర్లకు సమాచారం అందించాలని సీఐ కోరారు.
ఇదీ చదవండిః దుబ్బాక ఉప ఎన్నికపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు