ETV Bharat / jagte-raho

ఇప్పుడే వస్తానని చెప్పి  అదృశ్యమైంది..! - తమిళనాడు నుంచి పుట్టింటికి వచ్చి అదృశ్యం

తమిళనాడు అత్తగారి ఇంటి నుంచి తిరుమలగిరిలోని పుట్టింటికి వచ్చింది. భర్త సింగపూర్‌లో ఉద్యోగం చేస్తుండటంతో రెండు నెలలు అమ్మగారింట్లోనే ఉంది. ఆ రోజు ఏం జరిగిందో ఏమో.. ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రి నుంచి వచ్చే లోపు ఇంట్లో లేదు.

married women  came to the birth place and disappeared in tirumalgiri
ఇప్పుడే వస్తానని చెప్పి .. ఇంకనూ రాకపోవడంతో
author img

By

Published : Dec 26, 2020, 10:51 PM IST

ఓ వివాహిత మెట్టింటి నుంచి పుట్టింటికి వచ్చి అదృశ్యమైన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

తమిళనాడు నుంచి తెలంగాణకు

రెండు నెలల క్రితం ఐశ్వర్య అనే వివాహిత తన కుమారుడితో కలిసి.. తంజావూరు అత్తగారి ఇంటి నుంచి.. తిరుమలగిరికి పుట్టింటికి వచ్చింది. ఆమె భర్త విశ్వనాథ్ సింగపూర్‌లో ఉద్యోగం చేస్తుండటంతో .. రెండు నెలలుగా తన కుమారుడు తనీష్‌తో టీచర్స్ కాలనీలోనే ఉంది.

కుమారుడిని పక్కింట్లో వదిలి..

ఈనెల 24న ఐశ్వర్య తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లారు. ఇప్పుడే వస్తానని చెప్పి.. పక్కింటి మహేశ్వరి అనే మహిళ వద్ద తన కుమారుడిని వదిలి వెళ్లింది. ఎంతసేపటికీ ఐశ్వర్య తిరిగి రాకపోవడంతో వారు ఆందోళనకు గురై వారికి తెలిసిన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే వారి కుటుంబ సభ్యులు తిరుమలగిరి పీఎస్‌లోఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు..

ఇదీ చదవండి:ఆదిలాబాద్​ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.