సికింద్రాబాద్‌లోని ఆభరణాల దుకాణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. యజమాని దగ్గర గతంలో పనిచేసిన డ్రైవర్ ఆదిల్... ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు... రూ.39 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
చందుజైన్ నగల దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. దుకాణం వెంటిలేటర్‌ను తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 1.219 కిలోల బంగారం, 302 గ్రాముల వెండి చోరీ జరగ్గా... మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.