ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్గిరి జిల్లాలో.. ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. మల్కాన్గిరి జిల్లా కట్ ఆఫ్ ఏరియాలో గల జోడం పంచాయతీ ఖజిరిపుట్ గ్రామంలో దాస్ కీముడు అనే 25 ఏళ్ల యువకుడిని చంపేశారు.
ఇటీవల మావోయిస్టులు.. భద్రత బలగాలు లక్ష్యంగా పాతి పెట్టిన 7 మందుపాతరల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వటం వల్ల హత్య చేశారని.. అదే గ్రామనికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను సైతం మావోయిస్టులు గాయపరిచినట్లు సమాచారం. ఈ ఘటనతో కట్ ఆఫ్ ఏరియాలోని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: మావోయిస్టుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు పటిష్ఠ చర్యలు