భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు హత్య చేశారు. చర్ల మండలం చెన్నాపురం అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతుడిని వరంగల్ జిల్లాలోని లేబర్ కాలనీకి చెందిన ఈశ్వర్ అలియాస్ శ్రీనుగా పోలీసులు గుర్తించారు. ఈశ్వర్ హత్యకు గురైన తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులను భారీగా మోహరించారు.
ఇవీచూడండి: మావోయిస్టుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు పటిష్ఠ చర్యలు