ETV Bharat / jagte-raho

మావోయిస్టు సానుభూతి పరుడి అరెస్ట్​ - కొత్తగూడెం జిల్లా మావోయిస్టు వార్తలు

కొత్తగూడెం జిల్లాలో ఓ మావోయిస్టు సానుభూతి పరున్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వద్ద నుంచి పెద్ద మెుత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఛత్తీస్​గఢ్​​కు చెందినవాడిగా గుర్తించారు.

Maoist sympathizer Arrest in kothagudem district
మావోయిస్టు సానుభూతి పరుని అరెస్ట్​
author img

By

Published : Dec 21, 2020, 1:25 PM IST

మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తోన్న ఛత్తీస్​గఢ్​​కు చెందిన మడకం హరిబాబు అనే సానుభూతిపరుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబల్లి గ్రామం వద్ద పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ క్రమంలో పోలీసులను చూసి పారిపోతోన్న వ్యక్తిని పట్టుకున్నామని భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. దర్యాప్తులో అతను మావోయిస్టు సానుభూతిపరుడని గుర్తించామని అన్నారు.

హరిబాబుకు చాలా కాలం నుంచి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి 25 జెలిటిన్ స్టిక్స్, 2 డెటో నేటర్లు 50 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని రిమాండ్​కు తరలించామని ఏఎస్పీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఏవోబీలో మావోయిస్టుల బంద్... పోలీసుల అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.