భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజపేట కాలనీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్న ఒక మావోయిస్టుని అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించగా.. ఆ వ్యక్తి వద్ద ఉన్న సంచిని తనిఖీ చేశారు. సంచిలో మందుపాతరలు తయారీకి వాడే పేలుడు పదార్థాలు కనిపించగా.. వెంటనే అతడ్ని అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కిష్టారంకు చెందిన జోగా.. 2014 నుంచి మావోయిస్టు దళాల్లో పనిచేస్తున్నాడు. అనేకమందిని హత్య చేసిన కేసులతో పాటు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కేసుల్లో జోగా నిందితుడిగా ఉన్నట్లు ఏఎస్పీ వివరించారు. అతడి వద్ద నుంచి 50 జిలెటిన్ స్టిక్స్, 5 డిటోనేటర్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
ఇవీ చూడండి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు