హైదరాబాద్ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 11న అర్ధరాత్రి జరిగిన నాలుగు నెలల పాప కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కిడ్నాప్‌లో పాల్గొన్న ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. చిన్నారిని సురక్షితంగా తల్లికి అప్పగించారు.
పాప తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మంగళ్‌హాట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా షేక్ అలీమ్, ఆర్షియా, షేక్ సలీం అనే ముగ్గురు ఆటోలో వచ్చి పాపను అపహరించినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇవాళ బోయగూడ కమాన్ వద్ద ఆ ఆటోను గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం పాపను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇలా చేశారు...
షేక్ అలీమ్, ఆర్షియా, షేక్ సలీం అనే ఈ ముగ్గురు చిన్నారి తల్లి లక్ష్మిని కళ్లు కాంపౌండ్‌లో కలిశారు. లక్ష్మి తన వృద్ధ తండ్రితో ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నారు. పాపను కిడ్నాప్ చేసి నగరంలోని చౌరస్తాలో భిక్షాటన కోసం వాడుకోవాలని పథకం రచించారు. పథకం ప్రకారం ఈ నెల 11వ తేదీన అర్ధరాత్రి లక్ష్మి ఇంటి వద్దకు వెళ్లి నాలుగు నెలల పాపను దొంగలించారు. ఉదయం పాప కనిపించకపోవడంతో లక్ష్మి పోలీస్ స్షేటన్‌లో ఫిర్యాదు చేసినట్లు మంగళ్‌హట్ పోలీసులు తెెలిపారు.