మంచిర్యాల జిల్లా కేంద్రం శ్రీనివాస కాలనీలో వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. జిల్లాకు చెందిన ముగ్గురు నిర్వాహకులు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన 5 గురు విటులతో కలిసి వ్యభిచారం నిర్వహింస్తుండగా రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశామని డీసీపీ ఉదయ్‌కుమార్ తెలిపారు.
అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఎవరైనా ఇంటిని అద్దెకు ఇచ్చే క్రమంలో పూర్తి వివరాలు తెలుసుకోవలని కోరారు. ఎవరైనా అనుమానితులుగా ఉన్నట్లు అనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిందితుల నుంచి 15 వేల నగదు, 7 చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని డీసీపీ వెల్లడించారు.
ఇదీ చూడండి: జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్.. రూ. 45 లక్షలు డిమాండ్!