ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారంలో ఎన్నెస్పీ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి దుర్గం కృష్ణ మూర్తి అనే వ్యక్తి మృతి చెందాడు. నీటిలో నుంచి అతన్ని స్థానికులు బయటికి తీసీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.
గ్రామంలోని కాల్వకట్టపై ట్రాక్టర్‌తో పొలానికి బయలుదేరాడు. మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి కాలవలో పడింది. అందులో నుంచి కృష్ణ మూర్తిని బయటకు తీసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. అతని మరణం ఊరిలో అందర్నీ కలిచివేసింది.
ఇదీ చూడండి: అద్దె బస్సుల యజమానుల ఆందోళన