ETV Bharat / jagte-raho

కల్వర్టును ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి - మహబూబ్​నగర్ జిల్లా వార్తలు

గుర్తు తెలియని వ్యక్తి కల్వర్టును ఢీకొని మృతి చెందిన ఘటన మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం రాత్రి సమయంలో జరగడం వల్ల ఎవరూ గుర్తించలేకపోయారు. నీటిలో పడిన వ్యక్తి ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

man died with accident at devarakadra in mahabubnagar
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/25-November-2020/9662761_accident.jpg
author img

By

Published : Nov 25, 2020, 6:48 PM IST

కల్వర్టును ప్రమాదవశాత్తు ఢీకొట్టి.. పక్కనున్న నీటి కాలువలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో 167వ జాతీయ రహదారిపై చౌదర్ పల్లి సమీపంలో ఈ ప్రమాదం మంగళవారం జరిగింది. రహదారిపై ఉన్న ఇరుకైన కల్వర్టుపై టీవీఎస్​ వాహనంపై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టి పక్కన ఉన్న నీటి కాలువలో పడిపోయాడు. నీటిలో వాహనంతో సహా రాత్రిపూట పడటం వల్ల ఇతరులు గమనించ లేకపోయారు. ఊపిరి ఆడక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పశువుల కాపరులు బుధవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా... దేవరకద్ర ఎస్సై భగవంత రెడ్డి ఘటనా స్థలికి వచ్చి... మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే... దేవరకద్ర పోలీస్ స్టేషన్​లో సంప్రదించాలని కోరారు.

ఇదీ చదవండి: కల నెరవేరలేదని తనువు చాలించాడు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.