ETV Bharat / jagte-raho

దొంగతనానికి వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి - man died of electric shock in yadadri

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్​లో దొంగతనానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

man died of electric shock at malkapur
దొంగతనానికి వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి
author img

By

Published : Dec 26, 2020, 3:32 PM IST

కర్ణాటకలోని బీదర్​కు చెందిన ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతాల్లోని విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​లో రాగి తీగను చోరీ చేసేవారు. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్​ శివారులోని ఓ విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​లో రాగి తీగను దొంగతనం చేయడానికి ప్రయత్నించారు.

దొంగతనానికి వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి

ఈనెల 19న ట్రాన్స్​ఫార్మర్​కు విద్యుత్​ను నిలిపివేసి, రాగి తీగను తీసేందుకు యత్నించే క్రమంలో విద్యుత్ ప్రసారమై ముగ్గురిలో సంగమేశ్వర్​(22) అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా ఇద్దరు అక్కణ్నుంచి పరారయ్యారు. తర్వాత సంగమేశ్వర్ మృతదేహాన్ని అక్కణ్నుంచి తీసుకురావడానికి పలుమార్లు యత్నించి విఫలమయ్యారు.

చేసేదేం లేక హైదరాబాద్​లోని చాదర్​ఘాట్​ పోలీస్ స్టేషన్​లో సంగమేశ్వర్ అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో పొంతనలేని సమాధానాలు చెప్పడం వల్ల అనుమానం వచ్చిన పోలీసులు ఫిర్యాదు దారులను గట్టిగా విచారించడం వల్ల అసలు విషయం చెప్పారు.

విచారణలో నిందితులు తెలిపిన సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సంగమేశ్వర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.