మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లంపేట గ్రామానికి చెందిన ప్రశాంత్.. రోజూలానే పాశమైలారంలో ఉండే గ్లాండ్ ఫార్మా పరిశ్రమకు ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తున్నాడు. దుండిగల్ పరిధిలోని బౌరంపేట సమీపంలోకి రాగానే అతనికి మృత్యువు రూపంలో టిప్పర్ ఎదురుగా వచ్చి ప్రశాంత్‌ను ఢీకొంది.
తీవ్రగాయాలతో అతను అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!