నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పాల్దా గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. స్థానిక శ్రీనగర్ నుంచి జన్నేపల్లి వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొనగా లచ్చన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. కారు ఢీ కొనగా.. లచ్చన్న తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై యాకుబ్ తెలిపారు. ఘటన తర్వాత వాహనాన్ని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడని.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు వివరించారు.
ఇదీ చదవండిః విషతుల్యాల విరుగుడు.. సుఖీభవ వెల్నెస్ సెంటర్