సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్ తండాలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. శూన్యపహాడ్ తండాకు చెందిన రమావత్ దేవీలాల్ పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దేవీలాల్కు నెలరోజుల క్రితమే పెళ్లి జరిగింది. ఈ ఘటనతో భార్య, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చూడండి: ప్రమాదం: అదుపుతప్పి కారు బోల్తా.. ఐదుగురు మృతి