ఏపీలోని కడప జిల్లా రాయచోటిలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. రాజుల కాలనీకి చెందిన యూసఫ్ కొలిమిమిట్టకు చెందిన ఓ వివాహితతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. గతంలో ఈ విషయంపై ఆ మహిళ భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వీరిరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ ఘటనతో మార్పు కలగని యూసఫ్ మళ్లీ ఆ మహిళకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లిన యూసఫ్‌ను.. మహిళ, ఆమె భర్త మౌలాలి కలిసి దారుణంగా తలపై కొట్టారు. ఈ ఘటనలో యూసఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ పేరుతో సైబర్ మోసానికి స్కెచ్.. హెచ్చరించిన ఇంటర్‌పోల్