మల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖాధికారులు మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. అతని పేరుమీద ఉన్న బినామీ ఆస్తుల గురించి ఆరా తీస్తున్నారు. పెద్దఅంబర్ పేట్‌లోని ఓ హోటల్‌ను నర్సింహారెడ్డి బినామీ నిర్వహిస్తున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారనే వివరాలను సేకరిస్తున్నారు.
ఇప్పటికే అనంతపూర్‌లో 55ఎకరాల వ్యవసాయ భూమి, మాదాపూర్‌లో తన బినామీల పేర్ల మీద ఉన్న 1960 గజాల స్థలంతో పాటు.. పలుచోట్ల ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. నర్సింహారెడ్డి తన బినామీ ఆస్తుల గురించి పెద్దగా నోరు విప్పడం లేదు. దీంతో ఆధారాలను అతని ముందుంచి మరీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చూడండి: బినామీ ఆస్తుల గురించి దాటవేసిన ఏసీపీ నర్సింహారెడ్డి