ETV Bharat / jagte-raho

నమ్మకంగా ఉన్నాడు.. రూ.35లక్షల నగలు దోచేశాడు!

వృద్ధ దంపతులకు నమ్మకంగా సేవలందించిన ఓ దొంగ పనోడు.. కొత్త సంవత్సరం తొలి రోజు రూ.35 లక్షల నగలతో పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

maid stole gold and cash at kachiguda in Hyderabad
నందగోపాల్ ఓ దొంగ పనోడు
author img

By

Published : Jan 3, 2021, 9:46 AM IST

హైదరాబాద్ కాచిగూడ ఠాణా పరిధిలోని గోకుల్‌ ధామ్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ 205లో డాక్టర్‌ విజయ్‌ సీతారామ్‌, విజయ దంపతులు ఉంటున్నారు. వీరి వద్ద తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేటకు చెందిన నంద కుసరాజు.. నందగోపాల్‌గా పేరు మార్చుకొని రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఈ పేరుతోనే ఆధార్‌ కార్డు సృష్టించాడు. నాలుగు రోజుల క్రితం సీతారామ్‌ ఆసుపత్రిలో చేరడంతో ఆయన భార్య రాత్రిళ్లు అక్కడే ఉండి ఉదయాన్నే వచ్చేది.

ఇదే అవకాశంగా నందగోపాల్‌ డిసెంబరు 31 అర్ధరాత్రి దాటాక ఇంట్లోని బంగారు ఆభరణాలు, వెండి, నగదుతో ఉడాయించాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఫోన్‌లో మరో సిమ్‌కార్డును వినియోగించాడు. అయితే పోలీసులకు కీలక ఆధారం లభించడంతో శేరిలింగంపల్లిలోని అతడి స్నేహితుడి గదిలో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అల్వాల్‌లోనూ ఓ ఇంట్లో చోరీ చేసి పట్టుబడ్డాడని సీపీ అంజనీకుమార్ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.