మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ధర్మారం తండాలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎండు గంజాయిని ఇంట్లో అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి 10 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన గంజాయి విలువ రూ. 6 లక్షల వరకు ఉంటుందని తొర్రూరు ఆబ్కారీ సీఐ లావణ్యసంధ్య వివరించారు. ఈ మేరకు.. అక్రమంగా గంజాయి నిల్వ ఉంచిన గ్రామానికి చెందిన గుగులోతు హచ్చు, కొత్తతండాకు చెందిన తులస్యాపై పోలీసులు కేసు నమోదు చేశారు. తులస్యాను అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న హచ్చును గాలిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం