ETV Bharat / jagte-raho

ఆపగలమా ఆ తల్లి శోకాన్ని.. ఓదార్చగలమా ఆ తండ్రిని...

ఎవరాపగలరు ఆ తల్లి శోకాన్ని... ఎవరు ఓదార్చగలరు ఆ తండ్రి మౌన రోదనను. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇకలేడనే వార్తే... వాళ్లను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. కళ్ల ముందు తిరిగిన కొడుకు ఇక శాశ్వతంగా కనిపించడనే నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలో ఆ తల్లిదండ్రులకు తెలియడం లేదు. వాళ్ల దుఃఖాన్ని ఆపతరం ఎవరి వాళ్ల కావడం లేదు. డబ్బు కోసం కన్నతల్లి పేగు బంధాన్ని తెంచిన ఆ కసాయిని ఏంచేయాలి? డబ్బు ఇస్తామన్నా.. కూడా గొంతునులిమి చంపిన కిరాతకుడిని ఎలా శిక్షించాలి? ఆ తల్లిదండ్రుల బాధను ఎవరు తీర్చాలి?

ఆపగలమా ఆ తల్లి శోకాన్ని.. ఓదార్చగలమా ఆ తండ్రిని...
ఆపగలమా ఆ తల్లి శోకాన్ని.. ఓదార్చగలమా ఆ తండ్రిని...
author img

By

Published : Oct 22, 2020, 4:20 PM IST

Updated : Oct 22, 2020, 8:14 PM IST

మహబూబాబాద్​లో అపహరణకు గురైన దీక్షిత్​రెడ్డి మరణవార్త విని... బాలుడి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. జిల్లా కేంద్రంలోని క్రిష్టకాలనీలో నివాసం ఉంటున్న జర్నలిస్ట్ రంజిత్ రెడ్డి, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్​రెడ్డి ఆదివారం కిడ్నాప్​కు గురయ్యారు. అపహరణకు గురైన కొద్దిసేపటికి బాలుడి గొంతునులిమి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కిడ్నాపర్ డిమాండ్ చేసిన డబ్బును సిద్ధం చేసుకుని ఉంచారు. అయినా కూడా ఆ కసాయి బాలుడిని పొట్టనపెట్టుకున్నాడు. దీక్షిత్ ఇకలేడని తెలుసుకున్న తల్లిదండ్రుల వేదన వర్ణానాతీతం. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. బాలుడి మరణవార్త తెలుసుకున్న బంధువులు, స్థానికులు పెద్దఎత్తున ఇంటికి చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

  1. తండ్రి స్నేహితులే కిడ్నాప్‌ చేశారా?
  2. 24 గంటలు దాటినా లభించని బాలుడి ఆచూకీ
  3. మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య
  4. కిడ్నాప్ చేసిన గంటకే బాలుడి హత్య: ఎస్పీ కోటిరెడ్డి
Last Updated : Oct 22, 2020, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.