భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇష్టారీతిన సంచరిస్తూ ఎదురుపడ్డవారిని గాయపరిచాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
శుక్రవారం కొత్త రెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మి కుమారిపై వీధి కుక్కలు దాడి చేయగా ఆమె నోటి కింది భాగంలో గాయమైంది. సాయినగర్ లో కాకర్ల సతీష్ అనే చిన్నారి కంటి పైభాగంలో కరిచింది. చిన్నారి పూజితపై దాడి చేయడంతో తలపై మూడు చోట్ల గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. శనివారం ఉదయం కూడా అదే గ్రామంలో చిన్ని, నరసింహారావు, ఆదిలక్ష్మిలపై దాడి చేసిన కుక్కలు ఆ ముగ్గురిని గాయపరిచాయి.
ఇదీ చదవండి: 'కూలి'న బతుకులు: రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి