ETV Bharat / jagte-raho

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో చికిత్స - telangana news today

ఒకరినొకరు ఇద్దరూ ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. జీవించే ధైర్యం లేక.. ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. కానీ ప్రాణతీపితో ఆశపుట్టి ప్రేమికుడు తన స్నేహితులకు ఫోన్​ చేసి విషయం చెప్పాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది.

lovers-suicide-attempt-at-nallakunta-mulugu
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో చికిత్స
author img

By

Published : Jan 15, 2021, 9:16 PM IST

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంటలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన ధరంసోత్ రాజేష్​(21), భూపాలపల్లి మంజూర్​నగర్​కు చెందిన ఓ మైనర్​ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు.

అమ్మాయి ఇంట్లో విషయం తెలిసి వారి ప్రేమను పెద్దలు నిరాకరించారు. దీంతో గురువారం సాయంత్రం నల్లగుంటలో ఇద్దరూ కలుసుకుని దేవాదుల పైప్​లైన్​ ప్రాంతానికి వెళ్లి కలుపు మందు సేవించారు. కానీ రాజేష్ తన మిత్రులకు ఫోన్​చేసి తాము కలుపు మందు తీసుకున్న విషయం చెప్పాడు.

మిత్రులు అతని తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వారిని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఇద్దరిని మల్లంపల్లిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యువతిని హన్మకొండకు తీసుకెళ్లారు.

ఇదీ చూడండి : పండుగ మిగిల్చిన విషాదం.. గాలిపటమే యమపాశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.