భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గొర్రెపెట వాగు వంతెన వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మణుగూరు ఓసి గని నుంచి బొగ్గు లోడుతో ఓ లారీ భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి వెళుతుంది. విద్యుత్ కేంద్రంలోనే.. యూనిట్ 3,4 సీసీఎల్ పనుల జేబీసీఎల్ కంపెనీ చేపడుతోంది. కంపెనీ అవసరాల కోసం మణుగూరు నుంచి డీజిల్ డ్రమ్ములతో ట్రాక్టర్లో స్టోర్ ఇంఛార్జి కృష్ణారావు, డ్రైవర్ వెంకన్న బయలుదేరారు. గొర్రపేట వద్ద ట్రాక్టర్ను లారీ అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది.
ఈ ఘటనలో వెంకన్న, కృష్ణారావు మృతిచెందారు. ప్రమాద వేగానికి ట్రాక్టర్ పక్కనే ఉన్న కాలువలోకి పల్టీ కొట్టింది. ట్రాక్టర్ కిందనే వెంకన్న మృతదేహాం ఇరుక్కుపోయింది.
సమాచారం అందుకున్న సీఐ భానుప్రకాశ్.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంజిన్ కింద చిక్కకున్న మృతదేహాన్ని యంత్రం సాయంతో తీయించారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: కన్న కొడుకుని బలికొన్న తల్లి వివాహేతర సంబంధం