ETV Bharat / jagte-raho

పోలీసులకు చిక్కిన సీఆర్పీఎఫ్ మాజీ జవాన్.. కారు డోరులో.. !

author img

By

Published : Sep 27, 2020, 10:47 PM IST

కాదేది అక్రమ రవాణాకు అనర్హం అన్నట్లుంది మద్యం అక్రమార్కుల పరిస్థితి. ఆటో ఇంజన్​లోనూ.. కారు డిక్కీ, సీట్లల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదే కోవలో సీఆర్పీఎఫ్ మాజీ జవాన్ కారు డోర్​లో పెద్ద ఎత్తున మద్యం అక్రమ రవాణాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు.

liquor-illegal-transport-in-car-door-at-chittoor-district
పోలీసులకు చిక్కిన సీఆర్పీఎఫ్ మాజీ జవాన్.. కారు డోరులో.. !

సినీ ఫక్కీలో అక్రమంగా కారు డోర్​లో మద్యం రవాణా చేస్తున్న సీఆర్పీఎఫ్ మాజీ జవాన్​ను ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా వి.కోట పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక మద్యాన్ని రాష్ట్రంలోకి అక్రమంగా తీసుకొస్తున్న నిందితుడి కారును పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు.

సోదాలు నిర్వహించే క్రమంలో కారు డ్రైవర్ పారిపోయేందుకు యత్నించడంతో కారును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు డోర్​లో 310 కర్ణాటక మద్యం బాటిళ్లను గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యల్లం రాజు తెలిపారు.

ఇవీ చూడండి : వికారాబాద్​లో పంతొమ్మిదేళ్ల యువతి అపహరణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.