ETV Bharat / jagte-raho

రుణాలిస్తాం.. వాహనాలు అమ్ముతాం.. కొంచెం జాగ్రత్త..! - సైబర్​ నేరాలు

అంతర్జాలం వేదికగా సైబర్‌ నేరస్థులు రెచ్చిపోతున్నారు. నగర సైబర్‌క్రైమ్‌ పోలీస్టేషన్‌కు బుధవారం పలు ఫిర్యాదులు రాగా.. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

LATEST CYBER CRIMES
పంథా మార్చిన సైబర్‌ నేరస్థులు.. పెరిగిన మోసాలు
author img

By

Published : May 21, 2020, 10:08 AM IST

రుణం పేరుతో..

అబిడ్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వహించే ఉద్యోగికి రూ.5లక్షల వ్యక్తిగత రుణం ఇస్తామని ఫోన్‌ చేశారు. అవతలి వ్యక్తి ఓ సంస్థ ఫైనాన్స్‌ ప్రతినిధిగా పరిచయం చేసుకొని కొన్ని రుసుములు ఉంటాయని, అవి చెల్లిస్తే ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పడంతో పలు దఫాలుగా రూ.77వేలు చెల్లించానని బాధితుడు వాపోయాడు.

సగం ధరకే ట్రాక్టర్‌..

ఓఎల్‌ఎక్స్‌లో ట్రాక్టర్‌ను విక్రయిస్తున్నట్లు సైబర్‌ నేరస్థుడు పోస్టు చేశాడు. బషీర్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి చూసి కొనుగోలు చేసేందుకు ఫోన్‌ ద్వారా సంప్రదించాడు. అవతలి వ్యక్తి ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకుని ఇంటికే పంపిస్తామని రూ.1.60 లక్షలు వసూలు చేశాడు.

సిమ్‌కార్డు పేరిట..

వనస్థలిపురానికి చెందిన మహిళ(52)కు ఈ నెల 16న ఫోన్‌ వచ్చింది. ఎయిర్‌టెల్‌ కస్టమర్‌కేర్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ పరిచయం చేసుకున్నారు. మీ సిమ్‌కార్డు గడువు ముగుస్తుందని, రూ.10 చెల్లించి పునరుద్ధరించుకోవాలంటూ హెచ్చరించారు. ఫోన్‌ మాట్లాడుతుండగానే బాధితురాలికి ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. లింక్‌లో అడిగిన వివరాలు ఇవ్వగా బ్యాంకు ఖాతా నుంచి రూ.1.9 లక్షలు పోయాయి.

  • చిక్కడపల్లిలో నివసిస్తున్న ఓ న్యాయవాది ఈ-మెయిల్‌కు సైబర్‌ నేరస్థులు నకలు సృష్టించారు. తాను కాఠ్‌మాండూలో ఉన్నానని రూ.25వేలు నగదు పంపించాలని వచ్చిన మెయిల్‌కు స్పందించిన అతడి స్నేహితుడు బ్యాంక్‌ ఖాతాలో జమచేశాడు. అనంతరం న్యాయవాది కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయగా.. కాఠ్‌మాండూకే వెళ్లలేదని తెలిసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • సైన్యంలో జవాన్‌గా పనిచేస్తున్న వ్యక్తి బావమరిది పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించిన సైబర్‌ నేరస్థుడు అతడికి ప్రమాదం జరిగిందని సహాయం చేయాలని రూ.1.24లక్షలు నగదు బదిలీ చేయించుకున్నాడు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.