ETV Bharat / jagte-raho

ఫేస్​బుక్​లో ప్రేమించాడు.. పెళ్లి పేరుతో కిరాతకంగా చంపేశాడు! - person murdered his facebook girlfriend

వివాహితను ఫేస్​బుక్​లో ప్రేమించి.. పెళ్లి పేరుతో నమ్మించి మోజు తీరాక దారుణంగా హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. జనవరి 17న చేవెళ్ల మండలంలో జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని పోలీసులు రిమాండ్​కు తరలించారు.

lady murder case in rangarddy district
ఫేసుబుక్​లో ప్రేమించాడు.. పెళ్లి పేరుతో చంపేశాడు..
author img

By

Published : Sep 1, 2020, 8:54 AM IST

Updated : Sep 1, 2020, 12:21 PM IST

వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఓ వివాహిత, యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. తన కంటే 13 ఏళ్ల పెద్దదైన ఆమెను ప్రేమిస్తున్నానని... పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడు. మోజు తీరాక సోదరుడితో కలిసి దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది జనవరి 17న చేవెళ్ల మండలం, తంగడపల్లిలో చోటుచేసుకున్న ఈ హత్య కేసు వివరాలను సోమవారం శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌, సంత్‌ కబీర్‌నగర్‌ జిల్లా, చాపియా చెటైన్యాకు చెందిన జాకీ అక్తర్‌ (24) ముంబయిలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. అతనికి మూడేళ్ల క్రితం సిక్కిం, గ్యాంగ్‌చుంక్‌కు చెందిన దవా పస్సీ శెర్పా(37) అనే వివాహిత ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. భర్త ఇద్దరు పిల్లలున్న ఆమెను ప్రేమిస్తున్నానంటూ అక్తర్‌ ఫేస్‌బుక్‌లో వెంటపడ్డాడు.

జనవరి మొదటి వారంలో సిక్కింకు వెళ్లి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ముంబయికి తీసుకెళ్లాడు. అక్కడ సహజీవనం చేశారు. పెళ్లి కోసం శెర్పా ఒత్తిడి చేయడం వల్ల ఆమెను మట్టుబెట్టడానికి హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్న తన సోదరుడు అక్తర్‌ బారీ(24)తో కలిసి అక్తర్‌ పథకం వేశాడు. జనవరి 16న ముంబయి నుంచి ఇద్దరూ శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. అక్కడ అక్తర్‌బారీతో కలిసి అద్దె కారులో ముగ్గురూ చేవెళ్ల మండలం, మీర్జాపూర్‌ వద్దకు వెళ్లారు. శెర్పా గొంతుకు తాడు బిగించి కారులోనే హత్య చేశారు. అనంతరం అర్ధరాత్రి తంగడపల్లి పైవంతెన నుంచి మృత దేహాన్ని పడేశారు. మృతురాలి ఒంటిపై దుస్తులను తొలగించి ముఖంపై బండరాయితో బలంగా మోది పరారయ్యారు. ఈ కేసును సీసీ ఫుటేజ్​ ఆధారంగా విచారించినట్లు శంషాబాద్​ డీసీపీ ప్రకాశ్​రెడ్డి తెలిపారు. ప్రధాన నిందితుడు జాకీ అక్తర్​ను పోలీసులు రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి: విషాదం: కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో పడి యువకుడు మృతి

Last Updated : Sep 1, 2020, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.