ETV Bharat / jagte-raho

అడవిలో కోడి పందేలు.. అంతలోనే పరుగులు - kodi pandalu at Adavidevulapally

సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది.. ఊరికి దూరంగా ఉన్న ప్రాంతం.. కార్లు, బైక్​లతో పలువురు బయలుదేరారు. సంచుల్లో ఉన్న కోళ్లను పందేల కోసం సిద్ధం చేశారు. బయటకి తీసి పందేలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు చేపట్టారు. అంతే అప్రమత్తమైన వారు కోళ్లను వదిలి పరుగు తీశారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.

kodi pandalu in the forest at Adavidevulapally nalgonda
అడవిలో కోడి పందేలు.. పారిపోయిన దుండగులు
author img

By

Published : Jan 10, 2021, 6:50 PM IST

నల్గొండ జిల్లా అడవి దేవులపల్లి మండలంలో అటవీ ప్రాంతంలో కోడి పందేలు ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలోని కృష్ణపట్టి ప్రాంతాల్లో పోలీసుల కళ్లు గప్పి అడపా దడపా కోడి పందేలు జరుగుతూనే ఉన్నాయి. అడవి దేవులపల్లి అటవీ ప్రాంతంలో శనివారం దాదాపు 15 నుంచి 20 మంది కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు.

పోలీసులు అడవి దేవులపల్లి కోడి పందెం స్థావరంపై దాడులు చేసి ఏడు బైక్​లు ఓ కారు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో కోడి పందేలు ఆడేవారు పారిపోయారని, వారిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. ఎవరైనా పేకాట, కోడి పందేలా లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి : దొంగ నోట్ల చెలామణి.. ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.