ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. పి.గన్నవరం నియోజకవర్గం గుంట్రువారిపేటలో సోమవారం బాలిక అపహరణకు గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు... విజయవాడలో బాలిక సంయుక్తను గుర్తించారు.
అనంతరం అంబాజీపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. బాలిక కిడ్నాప్‌కు పథకం రచించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.