కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆమెను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ పట్ల సికింద్రాబాద్ కోర్టు సానుకూలంగా స్పందించింది. దర్యాప్తు పురోగతి కోసం 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కోర్టు.. భూమా అఖిలప్రియను మూడ్రోజుల కస్టడీకి తీసుకునేందుకు అనుమతించింది.
అఖిలప్రియను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు.. ఈనెల 13 వరకు విచారించనున్నారు. కిడ్నాప్ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. బోయిన్‌పల్లి అపహరణ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమె భర్త ఏ3 నిందితుడిగా ఉన్న భార్గవ్‌రామ్ పరారీలో ఉన్నారు. హఫీజ్‌పేట భూములకు సంబంధించిన వివాదంలో ప్రవీణ్‌రావ్ సోదరులను కిడ్నాప్‌నకు గురవగా.. దానివెనక ఉంది అఖిలప్రియ అని పోలీసులు నిర్ధరించారు. ఆమెను ప్రశ్నించి ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాలని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు