రోడ్డు ప్రమాదంలో కంగ్టి ఎంఈవో మృతి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కంగ్టి మండల విద్యాధికారి మల్లేశంను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. కంగ్టి నుంచి పటాన్చెరు వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఇస్నాపూర్‌లోని గురుకుల వసతి గృహం సమీపంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.సంతాపం తెలిపిన విద్యాశాఖ
సంగారెడ్డి జిల్లా మొత్తానికి ఉన్న ఒకే ఒక్క ఎంఈవో మృతితో కంగ్టిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లికార్జునపల్లికి చెందిన ఆయన 2005లో కంగ్టి ఎంఈవోగా నియామకమయ్యారు. అప్పటి నుంచి అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఎంఈవో మృతిపై జిల్లా విద్యా శాఖ సంతాపం తెలిపింది.
ఇదీ చదవండి:పిల్లోనిగూడలో రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య