ETV Bharat / jagte-raho

లంచం తీసుకుంటూ అనిశాకు దొరికిన జూనియర్​ అసిస్టెంట్ - karimnagar news

మెడికల్​ దుకాణం అనుమతిని లంచం తీసుకుంటూ... ఓ జూనియర్​ అసిస్టెంట్​తో పాటు అటెండర్​ అనిశా అధికారులకు దొరికిపోయారు. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

junior assistant arrested for taking bribe

author img

By

Published : Sep 8, 2020, 11:00 AM IST

ఔషధ దుకాణం అనుమతి కోసం లంచం తీసుకుంటూ కరీంనగర్​లోని డ్రగ్​ కంట్రోల్​ కార్యాలయంలో పనిచేసే ఓ జూనియర్​ అసిస్టెంట్​, అటెండర్​ అనిశా అధికారులకు దొరికిపోయారు. హుజురాబాద్​కు చెందిన రవీందర్ అనే వ్యక్తి మెడికల్ దుకాణం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోసం కొన్ని రోజుల కిందట కరీంనగర్​లోని కార్యాలయానికి వచ్చారు. అనుమతి ఇవ్వాలంటే ఇరవై వేలు లంచం ఇవ్వాల్సిందేనని జూనియర్ అసిస్టెంట్ వినాయక రెడ్డి పట్టుబట్టటం వల్ల బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

అధికారుల ప్రణాళిక ప్రకారం బాధితుడు జూనియర్ అసిస్టెంట్​ని కలిసి డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చాడు. కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా... రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేయటం వల్ల అతనికి సైతం డబ్బు ఇచ్చాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డబ్బులు దొరకటం వల్ల నిందితులను అరెస్టు చేసి అధికారులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: 28 వరకు శాసనసభ వర్షాకాల సమావేశాలు..ఈనెల 9న రెవెన్యూ బిల్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.