జోగులాంబ గద్వాల్ మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలోని ఆలయంలో చోరీ జరిగింది. గ్రామంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీ పగల గొట్టి డబ్బులు దోచుకెళ్లారు.
గ్రామస్థులు గుర్తించి పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. మానవపాడు పోలీస్‌లు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిచారు. గతేడాది శ్రీరామనవమి నుంచి ఇప్పటి వరకు హుండీ తెరవలేదని ఆలయ కమిటీ పేర్కొంది.
ఇదీ చూడండి: 'కేజీఎఫ్ 2' టీజర్‌పై అభ్యంతరం.. యష్‌కు నోటీసులు