నకిలీ జర్ధా తయారీ కేంద్రంపై హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ పోలీసులు దాడి చేశారు. బిలాల్ నగర్ ప్రాంతంలో కల్తీ జర్దా తయారు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేపట్టారు. నిర్వాహకుడితో పాటు ఐదుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. రూ. 3లక్షల విలువ గల జర్దాను, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
సదేఖ్ అనే వ్యక్తి.. జర్దాలో పర్ఫ్యూమ్, తదితర వాటిని కలిపేవాడు. పాన్ షాప్‌లలో వాడి వదిలేసిన డబ్బాలు సేకరించి అందులో ఈ జర్దా పెట్టి తిరిగి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఇవాళ, రేపు పొడి వాతావరణం... ఎల్లుండి తేలికపాటి వర్షాలు