జనగామ జిల్లా నీటిపారుదల శాఖ డీఈ రవీందర్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. రఘునాథపల్లి మండలం కుసుంభాయ్ తండాకు చెందిన గుగులోత్ కొంరెల్లి రూ. 19 లక్షల వ్యయంతో మిషన్ కాకతీయ పనులను కాంట్రాక్టు తీసుకుని పనులను పూర్తిచేశాడు. కాగా వాటి బిల్లుల కోసం డీఈ రవీందర్‌రెడ్డిని కలవగా ఆయన లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని అడిగాడు.. అంత ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పగా రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దానితో ఏం చేయాలో పాలుపోక బాధితుడు అ.ని.శా అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అతనిపై కేసునమోదు చేశారు.
ఇదీ చూడండి: తాగొచ్చిన ఆబ్కారీశాఖ అధికారిని నిర్భందించిన ఆదివాసీలు