రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రూర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని మౌఖిక అదృశ్యమైంది. ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు... పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరు రోజులైనా తమ కూతురి ఆచూకీ లభించలేదని... రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌ని కలిశారు.
మౌఖికను సరూర్‌నగర్ పరిధిలోని పీఎన్టీ కాలనీలో సీసీ కెమెరాలో గుర్తించనట్టు మహేశ్ భగవత్ తెలిపారు. కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్లిందనేది సమాచారం లేదన్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్టు వివరించారు. ఆచూకీ తెలిసినవారు 100కి సమాచారం ఇస్తే... రూ.25 వేల నగదు పారితోషికం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఇదీ చూడండి: పిన్‌ప్రింట్ టెక్నాలజీస్ కాల్‌సెంటర్‌పై సీసీఎస్ దాడులు