ETV Bharat / jagte-raho

బెల్లంపల్లికి చేరుకున్న శ్రావణ్ కుమార్ మృతదేహం - nri

ఏప్రిల్‌ 22న అమెరికాలో మృతి చెందిన బెల్లంపల్లి వాసి శ్రావణ్ కుమార్‌ మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన తమ కుమారుడు విగతజీవై రావడాన్ని చూసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

బెల్లంపల్లికి చేరుకున్న శ్రావణ్ కుమార్ మృతదేహం
author img

By

Published : May 4, 2019, 12:25 PM IST

అమెరికాలోని ఓ బీచ్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రావణ్ కుమార్‌ మృతదేహం శనివారం ఉదయం స్వస్థలానికి చేరుకుంది. కుమారుని మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. గత నెల 22న శ్రావణ్ కుమార్ బీచ్‌లో మృతి చెందగా అక్కడ అన్ని చట్టపరమైన పనులు పూర్తయ్యాక మృతదేహాన్ని భారత్‌కు పంపించారు. శ్రావణ్ కుమార్‌ను కడసరిగా చూడడానికి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. శోకసంద్రంలో మునిగిన శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులను ఓదార్చారు. శ్రావణ్ కుమార్ కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగమ్‌ పరామర్శించారు.

బెల్లంపల్లికి చేరుకున్న శ్రావణ్ కుమార్ మృతదేహం

ఇవీ చూడండి: బ్యాలెట్​ పత్రంపై వేలిముద్ర పడితే ఓటు చెల్లనట్టే

Intro:రిపోర్టర్ పేరు: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్:9949620369
tg_adb_81_04_sravan_dead_body_avb_c7
బెల్లంపల్లి కి చేరుకున్న శ్రావణ్ కుమార్ మృతదేహం
....కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు
అమెరికా లోని ఓ బీచ్ లో ప్రమాదవశాత్తు మృతి చెందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన రెడ్డి శ్రావణ్ మృతదేహం శనివారం ఉదయం పట్టణంలోని అశోక్ నగర్ కు చేరుకుంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ నుంచి ఉదయం బెల్లంపల్లి కి తరలించారు. కుమారుని మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. గత నెల 22 న శ్రావణ్ కుమార్ బీచ్ లో మృతి చెందగా అక్కడ అన్ని చట్టపరమైన పనులు పూర్తయ్యాక మృతదేహాన్ని పంపించారు. శ్రావణ్ కుమార్ ను కడసరిగా చూడడానికి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులను ఓదార్చారు. 12 రోజుల నుంచి కుటుంబ సభ్యులు శ్రావణ్ కుమార్ మృతదేహం కోసం ఎదురు చూశారు. చెట్టంత ఎదిగి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తమ కుమారుడు లేడన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగమ్ లు పరామర్శించారు. శ్రావణ్ కుమార్ మృతిపై కారణాలను తల్లిదండ్రులకు తెలపాలని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కోరారు. భారత ఎంబసీ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు.

Body:బైట్
గుండా మల్లేష్, మాజీ ఎమ్మెల్యే

Conclusion:బెల్లంపల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.