మత్తుపదార్థాల తరలింపునకు అక్రమార్కులు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి సరఫరా చేసేందుకు యత్నిస్తూ చిక్కారు. ఐలైనర్మస్కరాలో దాచిపెట్టి అక్రమంగా సరఫరా చేస్తున్న సుమారు రూ. 25 లక్షల విలువైన 490 గ్రాముల మెథక్వాలోన్‌ను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొస్తుండగా... బెంగళూరు కస్టమ్స్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు.
మరో కేసులో పశ్చిమ ఆఫ్రికా నుంచి 5 జతల బూట్ల జతల్లో దాచిపెట్టి తీసుకెళ్తున్న రూ. 12 లక్షల విలువైన 241 గ్రాముల విలువైన మెథక్వాలోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు కేసులకు సంబంధించి సరుకు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: ధరణిని సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించాలి: సీఎస్