సంగారెడ్డి జిల్లాలో ఆబ్కారీ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వాహనంలో పెద్దమొత్తంలో ఎండు గంజాయి లభ్యమైంది. శుక్రవారం రోజు ఉదయం దౌల్తాబాద్ క్రాస్ రోడ్లో తనిఖీ నిర్వహించగా మహేంద్ర బులోరో వాహనం అనుమానాస్పదంగా కనిపించిందని.. దానిని ఆపి సోదా చేయగా భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయి కనిపించిందని మెదక్ డిప్యూటీ కమిషనర్ కేవీబీ శాస్త్రి వివరించారు.
వాహనంలో పల్లీ సంచుల తరలింపును అడ్డుగా పెట్టుకుని వాటి కింద వరుసగా 421 ప్యాకెట్ల ఎండు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. ఒక్కో ప్యాకెట్లో 2 కిలోల ఎండు గంజాయి ఉందని, మొత్తం 850 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఎండు గంజాయి విలువ సుమారు 90 లక్షలు ఉంటుందన్నారు. ముద్దాయిని రిమాండు నిమిత్తం జోగిపేట ఎక్సైజ్ స్టేషన్కి తరలించామని తెలిపారు.
ఇదీ చూడండి: 'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'