ETV Bharat / jagte-raho

కుమురంభీం జిల్లాలో నాలుగు ఇసుక లారీలు స్వాధీనం

author img

By

Published : Sep 13, 2020, 7:48 PM IST

కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలో శనివారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలను పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

illegal transportation of  4 lorries sand seized by kumurambheem district police
కుమురంభీం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా.. నాలుగు లారీలు స్వాధీనం

కుమురంభీం జిల్లాలోని కాగజ్ నగర్, సిర్పూర్, పెంచికలపేట మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. పెంచికలపేట మండలంలోని లోడ్​పల్లి గ్రామంలో శనివారం రాత్రి 3గంటల సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి నాలుగు లారీలు పట్టుకున్నారు. సదరు లారీ డ్రైవర్లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్సై చుంచు రమేశ్​ తెలిపారు.

అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో నాలుగు ఇసుక లారీలతో పాటు 8 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుందని ప్రశ్నించగా.. తాము వెళ్లేసరికి కేవలం నాలుగు లారీలు మాత్రమే ఉన్నాయని ఎస్సై వెల్లడించారు. పెద్ద ఎత్తున వాగుల్లోంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: జోరుగా ఇసుక దందా.. అధికారులకు రైతుల ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.