వరంగల్ గ్రామీణ జిల్లాలో నాటు సారా ఏరులై పారుతోంది. అడ్డుఅదుపు లేకుండా గుడుంబా స్థావరాలను నిర్వహిస్తూ కొందరు కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చేలగాటం ఆడుతున్నారు . ముఖ్యంగా వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెo మండలాల్లో ఈ చీకటి దందా మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతోంది.
ఇన్నాళ్లు ఇళ్లలో సారా బట్టీలు నిర్వహించిన అక్రమార్కులు కొత్తపంథాలో అడుగులేస్తూ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. పంటపొలాల్లో గుడుంబా బట్టీలు నిర్వహిస్తు చీకటి దందాకు తెరలేపారు. ఇది గమనించిన ఆబ్కారీ శాఖ అధికారులు ప్రతేక బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. వేలాది లీటర్ల సారా, బెల్లం పానకం, బట్టీలను ధ్వంసం చేశారు. పలువురిపై కేసులు నమోదు చేసిన అధికారులు గుడుంబా స్థావరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు.
ఇదీ చదవండి: కోపంతో రగిలిన కోడలు... అత్త ముక్కు కొరికేసింది..