రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని పలు తండాల్లో నాటుసారా, బెల్లం స్వాధీనం చేసుకున్నారు. రంగంపేటలో ఓ రైతు పత్తి పంటతో పాటు అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలని ధ్వంసం చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.
బెల్లం పానకం ధ్వంసం
మండలంలోని ఖేలోత్ తండా, బండ, భంగిరెడ్డి నాయక్, హన్మ నాయక్, గర్జనపల్లి, వన్పల్లి, సీతారాం తండాల్లో ఎల్లారెడ్డి పేట ఎక్సైజ్ అధికారులు.. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 120 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 4 లీటర్ల నాటు సారా, 8 కిలోల బెల్లం, 2 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
అనంతరం రంగంపేటలో భూక్య తులసిరామ్, భూక్య తిరుపతి వారి పత్తి చేనులో అంతర పంటగా సాగుచేస్తున్న 261 గంజాయి మొక్కలను గుర్తించి వాటిని పీకేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: మూసీ మురుగు వదిలింది.. ఊపిరాడుతోంది...