నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావూడి తండ గ్రామపంచాయతీ పరిధిలోని తులసి తండాకు చెందిన ధనావత్ రాజు(39) తలకు గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కానీ మద్యం మత్తులో బాత్రూం వద్ద జారి పడి మృతి చెందినట్లు అతని కుటుంబీకులకు భార్య బుల్లి సమాచారం ఇచ్చింది. అంతటితో ఆగకుండా భర్త అంత్యక్రియలకు హడావుడిగా ఏర్పాట్లు చేసింది. అనుమానం వచ్చిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో రాజు మృతి పట్ల కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తలపై, మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు.. అంత్యక్రియలను అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసు నమోదు చేసుకుని మృతుని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహంపై బలమైన గాయాలు ఉండటంతో పదునైన వస్తువులతో కొట్టి చంపినట్లు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: సహనం కోల్పోయిన అత్త.. కిరాతంగా అల్లుడి హత్య