ETV Bharat / jagte-raho

భార్యని హత్య చేసి... ఫిట్స్​గా చిత్రీకరించాడు!

author img

By

Published : Dec 11, 2020, 2:20 PM IST

కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో భార్యని దారుణంగా హత్య చేశాడు. పైగా ఫిట్స్ వచ్చిందని నమ్మబలికాడు. తీగ లాగితే డొంక కదిలినట్లు అసలు విషయం బయటపడింది.

husband murdered wife at kompally in medchal
భార్యని హత్య చేసి... ఫిట్స్​గా చిత్రీకరించాడు!

భార్యని హత్య చేసిన ఓ ప్రబుద్ధుడు ఫిట్స్​గా చిత్రీకరించాడు. తీగ లాగితే డొంక కదిలినట్లు పోలీసుల విచారణలో ఆ కిరాతక భర్త గుట్టురట్టు అయింది. బొల్లారానికి చెందిన నాగరాజు, అనిత దంపతులు కొంతకాలంగా మేడ్చల్​ జిల్లా కొంపల్లిలో నివాసముంటున్నారు. డబ్బుల విషయంలో వీరి మధ్య గురువారం రాత్రి గొడవ జరగింది. మద్యం మత్తులో ఉన్న నాగరాజు భార్యను టవల్​తో గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఆమెకు ఫిట్స్ వచ్చి చనిపోయిందని నమ్మబలికాడు.

అనుమానం వచ్చిన పోలీసులు నాగరాజుని అదుపులోకి తీసుకుని విచారించగా తీగ లాగితే డొంక కదిలింది. తానే హత్య చేసినట్లు ఆమె భర్త అంగీకరించాడని పేట్ బషీరాబాద్ పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: పెళ్లి రోజు.. సవతి కుమార్తెలను చంపి తానూ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.